నీవు తోడైయుండగా
Neevu Thodaiyumdagaa
Lyricistజాషువా కట్ట
UncategorizedAdded on 5/7/2025
Lyrics
నీవు తోడైయుండగా యేసు – భయము లేదు ఇలలో మేలు చేయు దేవుడా నీకు – సాటి లేరు సృష్టిలో ఎక్కలేని కొండలెన్నో ఎదురొచ్చిననూ లెక్కలేని నిందలే నన్ను బాధించిననూ ||నీవు తోడైయుండగా|| గతం గాయాన్ని చేయగా – గాయం హృదయాన్ని చీల్చగా శోకం సంద్రంలా ముంచగా – లోకం బంధాలే తెంచగా పేరు పెట్టి తల్లిలా పిలచి లాలించితివి నీవే తోడు నీడగా నిలచి కృప చూపితివి ||నీవు తోడైయుండగా|| ఆశ నిరాశగా మారినా – నిరాశ నిస్పృహ పెంచినా యుక్తి తెలియక తిరిగినా – శక్తి క్షీణించిపోయినా వెన్ను తట్టి తండ్రిలా నిలిపి నడిపించితివి నీవే కొండ కోటగా నిలిచి బలపరచితివి ||నీవు తోడైయుండగా|| నీవు నాకు అండగా నిలచి – దారి చూపినావయ్యా నేను నీకు మెండుగా స్తుతులు – అర్పించెదను