నీవుంటే నాకు చాలు యేసయ్యా
Neevumtae Naaku Chaalu Yaesayyaa
UncategorizedAdded on 11/5/2013
Lyrics
శ్యామ్ జె వేదాల నీవుంటే నాకు చాలు యేసయ్యా నీవెంటే నేను ఉంటానేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ||నీవుంటే|| ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ ఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ ||నీ మాట|| బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూ అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా ||నీ మాట|| ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా ||నీ మాట|| నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము నీదు కృపతో నాకేమియు కాదిల సమానము ||నీ మాట||