నిబ్బరముతో నా యేసుకే
Nibbaramutho Naa Yaesukae
Lyricistపి సతీష్ కుమార్
UncategorizedAdded on 4/6/2017
Lyrics
నిబ్బరముతో నా యేసుకే స్తుతి పాడెదా వేకువనే లేచి నా ప్రభునే కొనియాడెదా యేసయ్యా… యేసయ్యా… స్తుతులకు పాత్రుడవు నీవయ్యా యేసయ్యా… యేసయ్యా… మాహిమ ఘనతలు నీకయ్యా (2) ||నిబ్బరముతో|| కష్టకాలమందు నాకు – కనికరము చూపెను కాలుజారుతున్నవేళ – కరుణతో నిలిపెను కడుపు కాలుతున్నవేళ – నా కడుపు నింపెను కన్నిటి బ్రతుకును – నాట్యముగా మార్చెను కఠినమైన కాలములో – నా చెంత నిలిచెను ||యేసయ్యా|| దిక్కుదెసలేని నాకు – దర్శనము నిచ్చెను ధనము ఘనము లేని నాకు ఘనతనెంతో నిచ్చెను దిక్కుతోచని వేళ – నా దిక్కై నిలిచెను దుష్ట శక్తులన్నిటిని – నాకు దూరపరచెను దీవెనలు కుమ్మరించి – ధన్యునిగా చేసెను ||యేసయ్యా||