నిబ్బరం కలిగి
Nibbarm Kaligi
Lyricistఅనిల్ కుమార్
UncategorizedAdded on 11/5/2015
Lyrics
నిబ్బరం కలిగి ధైర్యముగుండు దిగులు పడకు జడియకు ఎప్పుడు నిన్ను విడువడు నిన్ను మరువడు ప్రభువే నీ తోడు హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా ఊరక నిలిచి ప్రభువు చూపే – రక్షణ చూద్దాము నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ – కనబడరన్నాడు హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా ||నిబ్బరం|| పర్వతాలు తొలగినా – మెట్టలు తత్తరిల్లినా ప్రభు కృప మమ్మును విడువడుగా ఎక్కలేని ఎత్తైన కొండను ఎక్కించును మా ప్రభు కృప మమ్మును ప్రభువే మా బలము ||హల్లెలూయా|| మునుపటి కంటెను – అధికపు మేలును మా ప్రభు మాకు కలిగించును రెట్టింపు ఘనతతో మా తలను ఎత్తును శత్రువు ఎదుటనే భోజనమిచ్చును ప్రభువే మా ధ్వజము ||హల్లెలూయా|| మా అంగలార్పును – నాట్యముగా మార్చెను బూడిద బదులు సంతోషమిచ్చెను దుఃఖ దినములు సమాప్తమాయెను ఉల్లాస వస్త్రము ధరియింప చేసెను ప్రభునకే స్తోత్రం ||హల్లెలూయా|| స్త్రీ తన బిడ్డను – మరచినా మరచును మా ప్రభు మమ్మును మరువడుగా చూడుము నా అరచేతిలనే చెక్కితి నిను అన్నాడు ప్రభువు ప్రభువే చూచుకొనును ||హల్లెలూయా|| రాబోవు కాలమున – సమాధాన సంగతులే మా ప్రభు మాకై ఉద్దేశించెను ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నానని మా ప్రభువు చెప్పెను ఇప్పుడే అది మొలుచున్ ||హల్లెలూయా|| మేము కట్టని ఫురములను – మేం నాతని తోటలను మా ప్రభు మాకు అందించును ప్రాకారముగల పట్టణములోనికి ప్రభువే మమ్మును నడిపింపచేయును ప్రభువే మా పురము ||హల్లెలూయా||