నిజ స్నేహితుడా
Nija Snaehithudaa
Lyricistజాషువా కట్ట
UncategorizedAdded on 3/19/2023
Lyrics
నా చెలిమి కోరి – నీ కలిమి వీడి నా చెంత చేరావు శ్రీమంతుడా నా రక్షణ కొరకై – ఆ శిక్షను పొంది బలియాగమైన నిజ స్నేహితుడా ||నా చెలిమి|| ద్రోహినై దూరమైతిని – పాపినై పరుగులెడితిని గమ్యమే ఎరుగనైతిని – మరణమే శరణమాయెను ఎంతో ప్రేమించితివి – నా స్థానమందు నిలిచితివి కృపతో నన్ రక్షించితివి – నా దోషశిక్ష భరించితివి ||నా చెలిమి|| నిందలు అవమానములు – హేళనలు చీత్కారములు కఠిన దెబ్బలు ముళ్లపోటులు – సిలువ భారం కాయమంతా గాయం హృదినే బాధించినా – భరియించావు వేదన మౌనముగా తనువే తల్లడిల్లినా – తృప్తినొందావు నను తలచుకొని ||నా చెలిమి|| ఏ రీతి నిన్ను – కీర్తించగలను నా నీతి నీవే ఓ యేసుదేవా నీ సాక్షిగ నిలిచి – నీ ప్రేమను చాటి ఘనపరతును నిన్నే ప్రియ స్నేహితుడా