నిజమైన ద్రాక్షావ

Nijamaina Draakshaava

Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 3/6/2018

Lyrics

నిజమైన ద్రాక్షావల్లి నీవే
నిత్యమైన సంతోషము నీలోనే
శాశ్వతమైనది ఎంతో మధురమైనది
నాపైన నీకున్న ప్రేమ
ఎనలేని నీ ప్రేమ –
(2)         ||నిజమైన||
అతి కాంక్షనీయుడా దివ్యమైన నీ రూపులో
జీవించున్నాను నీ ప్రేమకు నే పత్రికగా
శిధిలమై యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి
నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా
(2)         ||నిజమైన||
నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో
అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా
వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు
జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా
(2)         ||నిజమైన||
షాలేము రాజా రమ్యమైన సీయోనుకే
నను నడిపించుము నీ చిత్తమైన మార్గములో
అలసి పోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి
ఆదరణ కర్తవై నను చేర్చుము నీ రాజ్యములో
(2)         ||నిజమైన||

Video