నిజముగా మొర పెట్టిన

Nijamugaa Mora Pettina

Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 1/6/2016

Lyrics

నిజముగా మొర పెట్టిన
దేవుడాలకించకుండునా
సహనముతో కనిపెట్టిన
సమాధానమీయకుండునా
జీవముగల దేవుడు మౌనముగా ఉండునా
తన పిల్లలకాయన మేలు చేయకుండునా
(2) ||నిజముగా||
పరలోక తండ్రినడిగిన
మంచి ఈవులీయకుండునా
కరములెత్తి ప్రార్థించినా
దీవెనలు కురియకుండునా
(2)       ||జీవముగల||
సృష్టి కర్త అయిన ప్రభువుకు
మన అక్కర తెలియకుండునా
సరి అయిన సమయానికి
దయచేయక ఊరకుండునా
(2)         ||జీవముగల||
సర్వశక్తుడైన ప్రభువుకు
సాధ్యము కానిదుండునా
తన మహిమ కనపరచుటకు
దయ చేయక ఊరకుండునా
(2)       ||జీవముగల||

Video