నింగిలో దేవుడు

Nimgilo Daevudu

Lyricistజాలాడి
UncategorizedAdded on 10/14/2016

Lyrics

నింగిలో దేవుడు నిను చూడ వచ్చాడు
ఆ నీతి సూర్యుడు శ్రీ యేసు నాధుడు
చెంత చేరి సంతసించుమా
స్వంతమైన క్రీస్తు సంఘమా
||నింగిలో||
పాపాల పంకిలమై శోకాలకంకితమై
మరణించి మన కోసం కరుణించి ఆ దైవం
దీన జన రక్షకుడై దేవ దేవుని సుతుడై
జన్మించె నీ కోసం ధన్యము చేయగా
(2)      ||నింగిలో||
సాతాను శోధనలే శాపాల వేదనలై
విలపించే దీనులకై అలరించు దీవెనలై
శరణమై ఉదయించే తరుణమౌ ఈ వేళ
గుండె గుడి పానుపులో చేర్చుకొన రావేల
(2)      ||నింగిలో||

Video