నిన్న నేడు నిరంతరం

Ninna Naedu Nirmtharm

UncategorizedAdded on 1/25/2015

Lyrics

నా జ్ఞాపకాలలో చెరగని వాడవు
నీవే నీవే నమ్మదగినా దేవుడవు
నీవు నా పక్షమై నిలిచేయున్నావు
యేసయ్యా నీ ప్రత్యక్షతలో
బయలుపడెనే శాశ్వతా కృప నాకై
విడువదే నన్నెల్లప్పుడూ కృప
విజయపథమున నడిపించెనే కృప
విస్తరించెనే నిన్ను స్తుతించినప్పుడు
||నిన్న||
యేసయ్యా నీ కృపాతిశయము
ఆదరించెనే శాశ్వత జీవముకై
మరువదే నన్నెల్లప్పుడూ కృప
మాణిక్య మణులను మరిపించేనే కృప
మైమరచితినే నీ కృప తలంచినప్పుడు
||నిన్న||
యేసయ్యా నీ మహిమైశ్వర్యము
చూపెనే నీ దీర్ఘశాంతము నాపై
ఆదుకునే నన్నెల్లప్పుడూ కృప
శాంతి సమరము చేసెనే కృప
మహిమోన్నతము పొందితి ప్రశాంతతలోనే
||నిన్న||

Video