నిన్నే నిన్నే నే కొలుతునయ్యా

Ninnae Ninnae Nae Koluthunayyaa

Lyricistకే రాజబాబు
UncategorizedAdded on 4/6/2017

Lyrics

యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
నీవే నీవే నా రాజువయ్యా
యేసయ్య యేసయ్య యేసయ్యా…
కొండలలో లోయలలో
అడవులలో ఎడారులలో
నన్ను గమనించినావా
నన్ను నడిపించినావా
(2)        ||యేసయ్యా||
ఆత్మీయులే నన్ను అవమానించగా
అన్యులు నన్ను అపహసించగా
అండ నీవైతివయ్యా
నా.. కొండ నీవే యేసయ్యా
(2)      ||యేసయ్యా||
మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప
నన్ను బలపరచెనయ్యా
నిన్నే ఘనపరతునయ్యా
(2)      ||యేసయ్యా||
వంచెన వంతెన ఒదిగిన భారాన
ఒసగక విసిగిన విసిరె కెరటాన
కలలా కడతేర్చినావా
నీ వలలో నను మోసినావా
(2)      ||యేసయ్యా||

Video