నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య

Ninnae Ninnae Nammukunnaanayya

Lyricistపి సతీష్ కుమార్
UncategorizedAdded on 2/1/2015

Lyrics

నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య
నన్ను నన్ను వీడిపోబోకయ్యా
నువ్వు లేక నేను బ్రతుకలేనయ్య
నీవుంటే నాకు చాలు యేసయ్య
||నిన్నే||
కన్నుల్లో కన్నీళ్లు గూడు కట్టినా
కన్నవారే కాదని నన్ను నెట్టినా
కారు చీకటులే నన్ను కమ్మినా
కఠినాత్ములెందరో నన్ను కొట్టినా
కఠినాత్ములెందరో నన్ను కొట్టినా
||నిన్నే||
చేయని నేరములంటకట్టినా
చేతకాని వాడనని చీదరించినా
చీకు చింతలు నన్ను చుట్టినా
చెలిమే చితికి నన్ను చేర్చినా
చెలిమే చితికి నన్ను చేర్చినా
||నిన్నే||

Video