నిన్ను చూడగ వచ్చినాడురా
Ninnu Choodaga Vachchinaaduraa
Lyricistఏ ఆర్ స్టీవెన్సన్
UncategorizedAdded on 12/24/2016
Lyrics
నిన్ను చూడగ వచ్చినాడురా దేవ దేవుడు గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసు నాథుడు లోకమే సంతోషించగా ప్రేమనే పంచే క్రీస్తుగా బెత్లెహేమను ఊరిలో కన్యకు పుట్టినాడురా పొత్తి గుడ్డల మధ్యలో హాయిగా నిద్దరోయెరా ||నిన్ను|| దేవుని కోపము నుండి తప్పించే ప్రియ పుత్రుడాయనే ముట్టుకో ముద్దు పెట్టుకో (2) ||బెత్లెహేమను|| గుండెలో కొలువైయుండి దీవించే ధనవంతుడాయనే ఎత్తుకో బాగా హత్తుకో (2) ||బెత్లెహేమను|| తోడుగ వెంటే ఉండి రక్షించే బలవంతుడాయనే చేరుకో నేడే కోరుకో (2) ||బెత్లెహేమను||