నిన్ను కాపాడు దేవుడు

Ninnu Kaapaadu Daevudu

Lyricistక్రాంతి చేపూరి
UncategorizedAdded on 10/23/2015

Lyrics

నిన్ను కాపాడు దేవుడు
కునుకడు నిదురపోడు – నిదురపోడు
వాగ్ధానమిచ్చి మాట తప్పడు
నమ్మదగినవాడు – నమ్మదగినవాడు
భయమేల నీకు – దిగులేల నీకు
ఆదరించు యేసు దేవుడు ఉండగా
||నిన్ను కాపాడు||
శత్రు బలము నిన్ను చుట్టుముట్టినా
శోధనలలో – నిన్ను నెట్టినా
కోడి తన పిల్లలను కాచునంతగా
కాపాడు దేవుడు నీకు ఉండగా
భయమేల నీకు – దిగులేల నీకు
కాపాడు గొప్ప దేవుడు ఉండగా
||నిన్ను కాపాడు||
రోగ భారమందు లేవకున్ననూ
వ్యాధులు నిన్ను కృంగదీసినా
చనిపోయిన లాజరును తిరిగి లేపిన
స్వస్థపరచు దేవుడు నీకు ఉండగా
భయమేల నీకు – దిగులేల నీకు
స్వస్థపరచు సత్య దేవుడు ఉండగా
||నిన్ను కాపాడు||

Video