నిన్ను కాపాడువాడు కునుకడు
Ninnu Kaapaaduvaadu Kunukadu
Lyricistజాన్ వెస్లీ
UncategorizedAdded on 1/28/2019
Lyrics
నిన్ను కాపాడువాడు కునుకడు నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు నీ భారము వహియించు యేసు నీ కొరకై మరణించె చూడు (2) ||నిన్ను కాపాడు|| పలుకరించే వారు లేక పరితపిస్తున్నా కనికరించి వారు లేక కుమిలిపోతున్నా కలతలెన్నో కీడులెన్నో బ్రతుకు ఆశను అణచివేసినా ఎడబాయడు యేసు నిన్ను దరి చేర్చును యేసు నిన్ను (2) ||నిన్ను కాపాడు|| మనస్సులోన శాంతి కరువై మదనపడుతున్నా పరుల మాటలు కృంగదీసి బాధపెడుతున్నా భీతులెన్నో భ్రాoతులెన్నో సంతసంబును త్రుంచివేసినా ఎడబాయడు యేసు నిన్ను దరి చేర్చును యేసు నిన్ను (2) ||నిన్ను కాపాడు||