నిన్ను తలచి
Ninnu Thalachi
UncategorizedAdded on 1/9/2016
Lyrics
నీ సాక్షిగా ఇల నే బ్రతుకుచుంటిని యేసయ్యా.. నీ కృప లేక నే బ్రతుకలేను (2) ||నిను తలచి|| జీవము లేని దైవారాధనలో నిర్జీవ క్రియలతో మృతుడనైతిని జీవాధిపతివై నా జీవితానికి నిత్య జీవము నొసగిన యేసయ్యా (2) ||నిను తలచి|| దారే తెలియని కారు చీకటిలో బ్రతుకే భారమై నలిగిపోతిని నీతి సూర్యుడా ఎదలో ఉదయించి బ్రతుకే వెలుగుతో నింపిన యేసయ్యా (2) ||నిను తలచి|| సద్గుణ శీలుడా సుగుణాలు చూచి హృదిలో నేను మురిసిపోతిని సుగుణాలు చూచుటకే నీవు సిలువలో నాకై నలిగిన యేసయ్యా (2) ||నిను తలచి||