నిన్ను వెంబడించెద
Ninnu Vembadimcheda
Lyricistజక్కి దేవరాజ్
UncategorizedAdded on 8/15/2021
Lyrics
నిన్ను వెంబడించెద నీ కాడి మోయుదున్ నీదు పాదముల చెంత నే నేర్చుకొందును మాదిరి నీవే – నెమ్మది నీవే దీనుడవు యేసయ్యా ||నిన్ను|| పాపాంధకారం లో నుండి రక్షించి వెలిగించితివి పరిశుద్ధమైన పిలుపుతో నీ వెంబడి రమ్మంటివి నీ వెంబడి రమ్మంటివి ||నిన్ను|| లోకాశలన్ని నీ కోసం నేనింక ఆశించను లోపంబులేని ప్రేమతో నీ కోసం జీవింతును నీ కోసం జీవింతును ||నిన్ను|| పవిత్రపరచుకొందును అర్పించు కొందును కష్టాలు శ్రమలు రేగినా నిను వీడిపోనయ్యా నిను వీడిపోనయ్యా ||నిన్ను|| ప్రేమ సువార్త ప్రకటింప భారంబు మోపితివి సత్యమార్గంబు చాటగ పంపుము నా ప్రభువా పంపుము నా ప్రభువా ||నిన్ను||