నిను చూసే కన్నులు

Ninu Choosae Kannulu

Lyricistపి సతీష్ కుమార్
UncategorizedAdded on 1/25/2015

Lyrics

నిను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా
నిను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా
నిను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా
నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా
||నిను చూసే||
కన్నీటి ప్రార్థన నాకు నేర్పయ్యా
ఆత్మల సంపద నాకు ఇవ్వయ్యా
నీ కొరకే జీవించే సాక్షిగా మార్చయ్యా
నాలోనే నిను చూపే మదిరినివ్వయ్యా
||నిను చూసే||
అందరితో సఖ్యత ఇమ్ము యేసయ్యా
మృదువైన మాటతీరు నాకు ఇవ్వయ్యా
కోపతాపములు దూరపరచయ్యా
అందరిని క్షమియించే మనస్సునివ్వయ్యా
||నిను చూసే||

Video