నిను పోలిన వారెవరూ

Ninu Polina Vaarevaroo

Lyricistబెన్ని జాషువా
UncategorizedAdded on 9/13/2020

Lyrics

నిను పోలిన వారెవరూ – మేలు చేయు దేవుడవు
నిన్నే నే నమ్మితిన్ నా దేవా
నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటిని
నీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య
ఎల్ షడ్డాయ్ ఆరాధన – ఎలోహిం ఆరాధన
అడోనాయ్ ఆరాధన – యేషువా ఆరాధన
కృంగియున్న నన్ను చూచి
కన్నీటిని తుడిచితివయ్య
కంటి పాప వలే కాచి
కరుణతో నడిపితివయ్య
(2) ||ఎల్ షడ్డాయ్||
మరణపు మార్గమందు
నడిచిన వేళయందు
వైద్యునిగా వచ్చి నాకు
మరో జన్మనిచ్చితివయ్య
(2) ||ఎల్ షడ్డాయ్||

Video