నిను స్తుతియించే కారణం
Ninu Sthuthiyimchae Kaaranm
UncategorizedAdded on 3/15/2018
Lyrics
షాలేం ఇశ్రాయేల్ అరసవెల్లి నిను స్తుతియించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా ప్రతి క్షణము ప్రతి దినము స్తుతియించుటే నా భాగ్యము ప్రతి క్షణము ప్రతి దినము స్తుతియించుటే నా జీవము ||నిను|| ఉన్నత స్థలములలోన నీకు స్తోత్రము అగాధ జలములలోన నీకు స్తోత్రము పరమందు నీకు స్తోత్రం ధరయందు నీకు స్తోత్రం ప్రతి చోట నీకు స్తోత్రం ప్రతి నోట నీకు స్తోత్రం (2) ||నిను|| చీకటి లోయలలోన నీకు స్తోత్రము మహిమాన్విత స్థలములలోన నీకు స్తోత్రము గృహమందు నీకు స్తోత్రం గుడిలోన నీకు స్తోత్రం ప్రతి చోట నీకు స్తోత్రం ప్రతి నోట నీకు స్తోత్రం (2) ||నిను|| నిన్నటి మేలుల కొరకై నీకు స్తోత్రము ఈ దిన దీవెన కొరకై నీకు స్తోత్రము శ్రమలైనా నీకు స్తోత్రం కరువైనా నీకు స్తోత్రం ప్రతి చోట నీకు స్తోత్రం ప్రతి నోట నీకు స్తోత్రం (2) ||నిను||