నిరతము స్తుతియించుము
Nirathamu Sthuthiyimchumu
UncategorizedAdded on 12/10/2020
Lyrics
రాజా రెడ్డి యరబం నిరతము స్తుతియించుము ఓ మనసా క్రీస్తేసుని స్తుతించు బాధలను తీర్చేటి ఆ స్తోత్రార్హుని కష్టాలు తొలగించే ఆ కరుణశీలుని మరువక స్తుతియించుము ఓ మనసా జయగీతముతో స్తుతించు ||నిరతము|| వేదనలో విడిపించే ఆ దేవ దేవుని స్తుతియించుము ఆపదలో ఆదుకొనే ఆరాధ్య దైవమునే స్తుతియించుము నిన్నిలలో ఓదార్చి తన కృపలో బలపరచే ఆ నిజ స్నేహితుని కృతజ్ఞత కలిగి స్తుతియించుము – (2) ||నిరతము|| అన్ని సమయాలలో చాలిన దేవుని స్తుతియించుము పేరు జీవ గ్రంథములో వ్రాసిన గొర్రెపిల్లని స్తుతియించుము నీ భారం తొలగించి తన కృపలో ఆదరించే నీ ఆత్మ కాపరియైన పరిశుద్ధాత్ముని స్తుతియించుము – (2) ||నిరతము||