నిరంతరమైన నీ కృపలో

Nirmtharamaina Nee Krupalo

Lyricistప్రతాప్ చిలమకూరు
UncategorizedAdded on 6/6/2020

Lyrics

నిరంతరమైన నీ కృపలో
నే పొందుచున్న ఆనందమే అది
అవధులు లేని ఆనందమే అది
శాశ్వతమైన ఆనందమే
(2)         ||నిరంతరమైన||
అర్హతే లేని నాకు అందలము నిచ్చినావు
అపవాదినెదిరించుటకు అధికారమిచ్చినావు
నా శక్తి కాదు దేవా – నీ ఆత్మ చేతనే
నీ ఘన కార్యములు వర్ణింప శక్యమే
(2)         ||నిరంతరమైన||
బలహీనుడైన నన్ను బలవంతుని చేసినావు
బలమైన కార్యములను బహుగా చేయించినావు
నా శక్తి కాదు దేవా – నీ ఆత్మ చేతనే
నీ ఘన కార్యములు వర్ణింప శక్యమే
(2)         ||నిరంతరమైన||
మహిమా ప్రభావము నీకే చెల్లింతు మహిమోన్నతుడా
మరణమైన నిన్ను విడువను నా పరుగు ముగిసేదాకా
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే
చావైతే అది ఎంతో మేలే
(2)         ||నిరంతరమైన||

Video