నిరంతరం నీతోనే

Nirmtharm Neethonae

Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 12/28/2021

Lyrics

నిరంతరం నీతోనే జీవించాలనే
ఆశ నన్నిల బ్రతికించుచున్నది
నా ప్రాణేశ్వరా యేసయ్యా
నా సర్వస్వమా యేసయ్యా
||నిరంతరం||
చీకటిలో నేనున్నప్పుడు
నీ వెలుగు నాపై ఉదయించెను
నీలోనే నేను వెలగాలని
నీ మహిమ నాలో నిలవాలని
పరిశుద్ధాత్మ అభిషేకముతో
నన్ను నింపుచున్నావు నీ రాకడకై
||నిరంతరం||
నీ రూపము నేను కోల్పయినా
నీ రక్తముతో కడిగితివి
నీతోనే నేను నడవాలని
నీ వలెనే నేను మారాలని
పరిశుద్ధాత్మ వరములతో
అలంకరించుచున్నావు నీ రాకడకై
||నిరంతరం||
తొలకరి వర్షపు జల్లులలో
నీ పొలములోని నాటితివి
నీలోనే చిగురించాలని
నీలోనే పుష్పించాలని
పరిశుద్ధాత్మ వర్షముతో
సిద్ధపరచుచున్నావు నీ రాకడకై
||నిరంతరం||

Video