నిత్య జీవపు రాజ్యములో
Nithya Jeevapu Raajyamulo
Lyricistదియ్యా ప్రసాద రావు
UncategorizedAdded on 8/21/2017
Lyrics
నిత్య జీవపు రాజ్యములో సత్య దేవుని సన్నిధిలో నిత్యం యేసుని స్నేహముతో నిత్యమానందమానందమే వ్యాధి భాధలు లేవచ్చట ఆకల్దప్పులు లేవచ్చట మన దీపము క్రీస్తేలే ఇక జీవితం వెలుగేలే (2) ||నిత్య|| కడు తెల్లని వస్త్రముతో పరి తేజో వాసులతో రాజ్యమునేలుదుములే యాజకులము మనమేలే (2) ||నిత్య|| ప్రతి భాష్పబిందువును ప్రభు యేసే తుడుచునులే ఇక దుఖము లేదులే మన బ్రతుకే నూతనమే (2) ||నిత్య|| పరిశుద్ధ జనములతో పరిశుద్ధ దూతలతో హల్లెలూయా గానాలతో వెంబడింతుము యేసునితో (2) ||నిత్య||