నిత్యం నిలిచేది

Nithym Nilichaedi

UncategorizedAdded on 5/17/2020

Lyrics

సునీల్ కుమార్ యలగపాటి
నిత్యం నిలిచేది – నీ ప్రేమే యేసయ్యా
నిలకడగా ఉండేది – నీ మాటే యేసయ్యా
నాతో ఉండేది – నీ స్నేహం యేసయ్యా
నాలో ఉండేది – నీ పాటే యేసయ్యా
(2)     ||నిత్యం||
మంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివి
విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు
నీకెవరూ సాటే రారయ్యా
నీకంటే లోకంలో ఘనులెవరేసయ్యా
(2)     ||నిత్యం||
ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా
అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా
నిజమైన స్నేహం నీదయ్యా
నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా
(2)     ||నిత్యం||

Video