నూతన హృదయము
Noothana Hrudayamu
Lyricistజోయెల్ కొడాలి
UncategorizedAdded on 10/27/2022
Lyrics
నూతన హృదయము నూతన స్వభావము నూతన ప్రారంభం నాకు దయచేయుము చెదరిన బ్రతుకును పగిలిన గుండెను నలిగిన మనస్సును నూతన పరచుము యేసు నీవే నన్ను సృజియించిన వాడవు నా బలహీనతలన్ని యెరిగియున్నావు రాతి గుండెను నాలో తీసివేయుము అతి మెత్తని హృదయము దయచేయుము ||నూతన హృదయము|| జీవమును వదులుకుని వెలుపలకు నే పారిపోతిని పాపములో భోగమును ఆశించి నే మోసపోతిని నా దేహం నా హృదయం వ్యసనముతోనే నిండిపోయెను హీనముగా దిగజారి ఘోరముగా నే కృంగిపోతిని నిన్ను విడచి నే క్షణమైనా బ్రతుకలేక వెనుతిరిగి నీ చెంతకు వచ్చుచున్నాను శుద్ధజలమును నాపై వెదజల్లుము హిమము కంటెను తెల్లగా కడిగివేయుము ||నూతన హృదయము|| నా పాపం అపరాధం నానుండి దూరము చేయుదువు అని నా భయము అవమానం బిడియమును తొలగించి వేతువని నా గతము జ్ఞాపకము నీ మదిలో ఇక దాచుకోవు అని నిన్నెరిగి ధైర్యముగా నీ ముందు నే నిలబడియున్నాను నీ శరణు కోరువారిని త్రోసివేయవు కృపగల మహాదేవ నన్ను మన్నించుము సదా కృతజ్ఞత స్తుతులు నీకే అర్పింతును సర్వ మహిమ ప్రభావము నీకే చెల్లును ||నూతన హృదయము||