నోరారగా చేతును

Noraaragaa Chaethunu

Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 12/20/2017

Lyrics

నోరారగా చేతును
దైవారాధనను
ధారాళముగా పాడెదను
స్తోత్ర గీతమును
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హాల్లేలూయా
(2)      ||నోరారగా||
భరియించితివి నా పాపపు శిక్షన్
జరిగించితివి నీ రక్షణ కార్యము నాలో
(2)      ||హల్లెలూయా||
విడిపించితివి పాప శిక్ష నుండి
నడిపించితివి జీవ మార్గము నందు
(2)      ||హల్లెలూయా||
దయచేసితివి మోక్ష భాగ్యము నాకు
క్రయమిచ్చితివి నా విమోచనకై
(2)      ||హల్లెలూయా||
వెలిగించితివి నా మనోనేత్రములు
తొలగించితివి నా పాప చీకటి బ్రతుకు
(2)      ||హల్లెలూయా||

Video