న్యాయాధిపతి
Nyaayaadhipathi
Lyricistక్రాంతి చేపూరి
UncategorizedAdded on 6/16/2023
Lyrics
న్యాయాధిపతియైన దేవుడు – నిన్ను పిలిచే వేళలోన ఏ గుంపులో ఉంటావో తెలుసుకో – మరలా వచ్చే వేళలోన ఒక గుంపేమో పరలోకపు గుంపు రక్షింపబడిన వారికే అది సొంతం మరు గుంపేమో ఘోర నరకపు గుంపు నిజ దేవుని ఎరుగని వారికి అది అంతం ||న్యాయాధిపతి|| నీవు కాదు నీ క్రియలు కాదు – ఆ పరముకు నిను చేర్చేది కాదు కాదు వేరెవరో కాదు – మరణమును తప్పించేది కలువరిలో తన ప్రాణం పెట్టిన యేసయ్యే నీ ప్రాణ రక్షణ సిలువలో క్రయ ధనమే చెల్లించిన ఆ ప్రభువే నీ పాప విమోచన ||ఒక గుంపేమో|| ఇదియే సమయం ఇక లేదే తరుణం – నీ పాపము ఒప్పుకొనుటకు ఆ పరలోకం చేరే మార్గం – యేసేగా ప్రతి ఒక్కరకు మేఘముపై రానైయున్నాడుగా త్వరలోనే నిను కొనిపోడానికి వెనుదీయకు ఓ నా ప్రియ నేస్తమా నీ హృదిలో స్వీకరించడానికి ||ఒక గుంపేమో||