న్యాయాధిపతి అయిన దేవుడు

Nyaayaadhipathi Ayina Daevudu

Lyricistదియ్యా ప్రసాద రావు
UncategorizedAdded on 7/7/2021

Lyrics

న్యాయాధిపతి అయిన దేవుడు
నిను తీర్పు తీర్చేటి వేళలో
ఏ గుంపులో నీవుందువో
యోచించుకో ఓ మానవా
(2)      ||న్యాయాధిపతి||
ఆకలితో అలమటించగా
దాహముతో తపియించగా
రోగముతో కృశియించగా
నను చేర్చుకొనలేదు నీవెందుకు
అని యేసు నిన్నడిగిన ఏమందువు
(2)      ||న్యాయాధిపతి||
గ్రహియించుకో నీదు గమ్యము
విడనాడు పాప గతమును
లేదింక నీకు తరుణము
ప్రభునాశ్రయించుటే బహు క్షేమము
ప్రభుని చేర్చుకో సరిదిద్దుకో
(2)      ||న్యాయాధిపతి||

Video