ఓ మానవా
O Maanavaa
Lyricistక్రాంతి చేపూరి
UncategorizedAdded on 10/26/2015
Lyrics
ఓ మానవా.. నిజమేదో ఎరుగవా ఓ మానవా.. ఇకనైనా మారవా మన పాపములను క్షమియించుటకే సిలువ మరణము పొందెనని గ్రహియించి నేడు – ఆ యేసు ప్రభుని వేడు ఈ దినమే అనుకూలం… లేదిక వేరే ఏ సమయం నిజమేదో తెలియకనే చనిపోతే నీ గతి ఏమి? (2) ||ఓ మానవా|| సిలువను గూర్చిన శుభ వార్త వెర్రితనముగా ఉన్నదా? దేవుని శక్తని తెలుసుకొని ప్రభు మార్గమును చేరెదవా (2) ||ఈ దినమే|| ప్రయాసముతో భారము మోసే నిన్నే దేవుడు పిలిచెనుగా ప్రయత్నము వీడి విశ్రాంతిని పొంద వేగిరమే పరుగిడి రావా (2) ||ఈ దినమే|| నీ ధనము నీ ఘనము నీ సర్వస్వము చితి వరకే అర్పించుము నీ హృదయమును (నిజ) రక్షకుడైన ప్రభు కొరకే (2) ||ఈ దినమే||