ఓ సంఘమా సర్వాంగమా

O Smghamaa Sarvaamgamaa

UncategorizedAdded on 11/4/2017

Lyrics

యేసయ్యను ఎదుర్కొనగ – నీతి నలంకరించి సిద్ధపడుమా
ఓ సంఘమా వినుమా
రాణి ఓఫిరు అపరంజితో – స్వర్ణ వివర్ణ వస్త్ర ధారణతో
వీణ వాయిద్య తరంగాలతో – ప్రాణేశ్వరుని ప్రసన్నతతో
ఆనంద తైల సుగంధాభిషేకము
పొందితినే యేసునందు
(2)       ||ఓ సంఘమా||
క్రీస్తే నిన్ను ప్రేమించెనని – తన ప్రాణ మర్పించెనని
స్వస్థపరచె నిర్దోషముగా – ముడత కళంకము లేనిదిగ
మహిమా యుక్తంబుగా నిలువ గోరె యేసుడు
సహియింతువా తీర్పునాడు
(2)       ||ఓ సంఘమా||
చీకటిలో నుండి వెలుగునకు – లోకములో నుండి వెలుపలకు
శ్రీకర గుణాతిశయములను – ప్రకటించుటకే పిలిచెనని
గుర్తించుచుంటివా క్రియలను గంటివా
సజీవముగా నున్నావా
(2)       ||ఓ సంఘమా||
చల్లగనైన వెచ్చగను – ఉండిన నీకది మేలగును
నులివెచ్చని స్థితి నీకుండిన – బయటకు ఉమ్మి వేయబడుదువేమో
నీ మనసు మార్చుకో తొలిప్రేమ కూర్చుకో
ఆసక్తితో రక్షణ పొందుమా
(2)       ||ఓ సంఘమా||

Video