ఓ యాత్రికుడా
O Yaathrikudaa
Lyricistవిక్టర్ రాంపోగు
UncategorizedAdded on 2/6/2019
Lyrics
ఓ యాత్రికుడా ఓహో యాత్రికుడా బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా.. ఓ బాటసారి ఓహో బాటసారి జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపొతుంది నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది అంతా ఆ దైవ నిర్ణయం మనిషి కాలగత దేవుని ఆదేశం (2) ||ఓ యాత్రికుడా|| పుట్టగానే తొట్టెలో వేస్తారు గిట్టగానే పెట్టెలో మూస్తారు జాగు చేయక కాటికి మోస్తారు ఆరడుగుల గుంటలో తోస్తారు ఆ అ ఆ. ఆ.. బ్రతుకు మూల్యమింతే – మనిషికి ఉన్న విలువంతే అంతా ఆ దైవ నిర్ణయం మనిషి కాలగత దేవుని ఆదేశం (2) ||ఓ యాత్రికుడా|| ఏడ్చుకుంటూ భూమిపై పుడతావు ఏడిపిస్తూ సమాధికి పోతావు కూడబెట్టినవి మోసుకు పోలేవు ఆశించినవేవి నీ వెంటారావు ఓ ఒ ఓ..ఓ.. జీవిత సారము ఇంతే – మనిషి బ్రతుకు భావము అంతే అంతా ఆ దైవ నిర్ణయం మనిషి కాలగత దేవుని ఆదేశం (2) ||ఓ యాత్రికుడా|| మరణము ఒక నిద్ర యేసునందు అంతము అది కాదు క్రీస్తునందు మృతులు లేచుట స్థిరము యేసునందు నిత్య జీవము వరము క్రీస్తునందు ఆ అ ఆ.. ఆ.. నేడే రక్షన సమయము – ఇక ఆలసించిన నరకము అంతా ఆ దైవ నిర్ణయం మనిషి కాలగత దేవుని ఆదేశం (2) ||ఓ యాత్రికుడా||