ఒక క్షణమైనా నిన్ను
Oka Kshanamainaa Ninnu
Lyricistజోసఫ్ కొండా
UncategorizedAdded on 11/3/2018
Lyrics
ఒక క్షణమైనా నిన్ను వీడి ఉండలేనయ్య నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ఒక క్షణమైనా|| నశియించిపోతున్న నన్ను బ్రతికించినావయ్యా యేసు కృశించిపోతున్న నాలో వేంచేసినావయ్యా యేసు నీ కార్యములెంతో ఆశ్చర్యకరములయ్యా నీ వాగ్దానములెంతో నమ్మదగినవయ్యా ||యేసయ్యా|| మతిలేక తిరిగిన నన్ను నీ దరి చేర్చినావయ్యా యేసు శ్రమ చేత నలిగిన నాకు వరమిచ్చినావయ్యా యేసు నీ ఆలోచనలెంతో లోతైన దీవెనయ్యా నీ తలపులు ఎంతో మధురము నా యేసయ్యా ||యేసయ్యా||