ఒక వరమడిగితిని యేసయ్యా

Oka Varamadigithini Yaesayyaa

Lyricistదీవెనయ్య
UncategorizedAdded on 6/28/2016

Lyrics

ఒక వరమడిగితిని యేసయ్యా
నీలా ఉండాలని – మండుచుండాలని
నీలా ఉండాలని – మండుచుండాలని
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
(2)       ||ఒక వరమడిగితిని||
నాలో నేరము స్థాపించగలరా
ప్రతిధ్వని ఇచ్చెను నీ స్వరము ధరలో
నన్ను పరిశుద్ధపరచి తుది శ్వాస వరకు
నీ మార్గములలో నడిపించవా
(2)       ||ఒక వరమడిగితిని||
సర్వ సృష్టికి సర్వాధికారి
తల వాల్చుటకును స్థలమింత లేదా
నేను లోకాశ విడచి పైనున్నవాటి
గురి కలిగి వెదకి పొందాలని
(2)       ||ఒక వరమడిగితిని||
తండ్రిని విడచి పారమును వీడి
నన్ను సమీపించినావు
నేను కలిగున్నదంత నీ పాదాల చెంత
అర్పించి నీ చెంత చేరాలని
(2)       ||ఒక వరమడిగితిని||
దేవుని చిత్తము సంపూర్తి చేయగ
సిలువలో వ్రేళాడి శ్రమ నొందినావు
నేను నీ సిలువ మోయుచు కడవరకు ఇలలో
నీ సాక్షిగా జీవించాలని
(2)       ||ఒక వరమడిగితిని||