ఒకే ఒక మార్గము

Okae Oka Maargamu

Lyricistవిద్యార్ధి గీతావళి
UncategorizedAdded on 9/4/2018

Lyrics

ఒకే ఒక మార్గము – ఒకే ఆధారము
ఒకే పరిహారము
లేదు వేరే మార్గం – క్రీస్తేసే మార్గం –
విడువుము నీ మార్గం
||ఒకే ఒక||
లోకం మాయరా – పాపం వీడరా
నీ హృదయమెంతో బలహీనమంతా
పెడ దారి చూపురా
పరికించి చూడుమా
||ఒకే ఒక||
రక్తం చిందెరా – సిలువలో చూడరా
నీ పాపములకు ప్రభు యేసు రక్తం
పరిహారమాయెరా
క్షమ భిక్ష వేడరా
||ఒకే ఒక||
సమయం లేదురా – సత్యమే సోదరా
రారాజు త్వరలో రాబోవుచుండె
రక్షణను కోరుమా
రయముగను చేరుమా
||ఒకే ఒక||

Video