ఒకసారి నీ స్వరము

Okasaari Nee Svaramu

Lyricistజాన్ వెస్లీ
UncategorizedAdded on 8/10/2018

Lyrics

ఒకసారి నీ స్వరము వినగానే
ఓ దేవా నా మనసు నిండింది
ఒకసారి నీ ముఖము చూడగానే
యేసయ్య నా మనసు పొంగింది
నా ప్రతి శ్వాసలో నువ్వే
ప్రతి ధ్యాసలో నువ్వే
ప్రతి మాటలో నువ్వే
నా ప్రతి బాటలో నువ్వే
(2)         ||ఒకసారి||
నీ సిలువ నుండి కురిసింది ప్రేమ
ఏ ప్రేమ అయినా సరితూగునా
నీ దివ్య రూపం మెరిసింది ఇలలో
తొలగించె నాలోని ఆవేదన
||నా ప్రతి||
ఇలలోన ప్రతి మనిషి నీ రూపమే కదా
బ్రతికించు మమ్ములను నీ కోసమే
తొలగాలి చీకట్లు వెలగాలి ప్రతి హృదయం
నడిపించు మమ్ములను నీ బాటలో
||నా ప్రతి||

Video