ఒక్కడే యేసు ఒక్కడే

Okkadae Yaesu Okkadae

UncategorizedAdded on 2/12/2017

Lyrics

ఒక్కడే యేసు ఒక్కడే
ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే
మహాదేవుడు మహిమోన్నతుడు
లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే
(2)        ||ఒక్కడే||
పాపిని రక్షించువాడు యేసు ఒక్కడే
పాపిని ప్రేమించువాడు యేసు ఒక్కడే
జీవమార్గమై సత్యదైవమై
మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే
(2)        ||ఒక్కడే||
అద్వితీయ దేవుడు యేసు ఒక్కడే
అద్భుతములు చేయువాడు యేసు ఒక్కడే
ఆదరించి ఆశ్రయమిచ్చి
అనుక్షణము కాపాడు యేసు ఒక్కడే
(2)        ||ఒక్కడే||
నిత్యమూ ప్రేమించువాడు యేసు ఒక్కడే
నిత్యా శాంతినిచ్చువాడు యేసు ఒక్కడే
నీ వేదనలో నీ బాధలలో
నీ అండగా నిలుచువాడు యేసు ఒక్కడే
(2)        ||ఒక్కడే||
మరణము గెలిచినవాడు యేసు ఒక్కడే
మరల రానున్నవాడు యేసు ఒక్కడే
పరిశుద్దులను ఆ పరమునకు
కొనిపోవువాడు యేసు ఒక్కడే
(2)        ||ఒక్కడే||

Video