ఊహించలేని కార్యములు
Oohimchalaeni Kaaryamulu
UncategorizedAdded on 6/10/2017
Lyrics
కానానులో మహిమను చూపి కార్యము జరిగించినాడు దంపతులను దీవించగా బంధువులు విచ్చేసినారు ఘనమైన కార్యము తిలకించగా ఆత్మీయులే వచ్చినారు ఆనందమే ఆనందమే ఈ పెళ్లి సంతోషమే కళ్యాణము కమనీయము కళ్యాణ వైభోగము ||ఊహించలేని|| ఒకరికి ఒకరు ముడి వేసుకొనే బంధం ఒకరంటే ఒకరికి ప్రేమను పంచే తరుణం కలవాలి హృదయాలు ఒకటై పండాలి నూరేళ్లు ఇకపై వెయ్యేళ్ళు వర్ధిల్లాలని ఇస్తున్నాము ఇవ్వాళ ||ఊహించలేని|| దేవుని సముఖములో బ్రతకాలి మీరు మీ జీవిత పయనం సాగాలి ఆ దేవునితో లోబడి ఉండాలి వధువు ప్రేమను పంచాలి వరుడు దేవుడిచ్చే బహుమానం మీ కన్నుల పంట కావాలి ||ఊహించలేని||