పాడనా మౌనముగానే
Paadanaa Maunamugaanae
Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 6/1/2017
Lyrics
పాడనా మౌనముగానే స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తిపరచెనే (2) ||పాడనా|| ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునే నీ రక్తాభిషేకము కడిగెనే నా ప్రాణాత్మ శరీరమును నా విమోచన గానము నీవే నా రక్షణ శృంగము నీవే (2) ||పాడనా|| దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుందునే నీ ప్రశాంత పవనాలు అణచెనే నా వ్యామోహపు పొంగులన్నియు నా ఓదార్పు నిధివి నీవే నా ఆనంద క్షేత్రము నీవే (2) ||పాడనా|| నీ ఆలయమై నీ మహిమను నేను కప్పుకొంటిని నీ తైలాభిషేకము నిండెనే నా అంతరంగమంతయును నా మానస వీణవు నీవే నా ఆరాధన పల్లకి నీవే (2) ||పాడనా||