పాడెద దేవా నీ కృపలన్

Paadeda Daevaa Nee Krupalan

Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 12/29/2021

Lyrics

పాడెద దేవా – నీ కృపలన్
నూతన గీతములన్
స్తోత్రము చెల్లింతున్ – స్తుతి స్తోత్రము చెల్లింతున్
భూమి పునాదులు వేయకముందే
యేసులో చేసితివి
ప్రేమ పునాదులు వేసితివి
దీనుని బ్రోచితివి – ఈ దీనుని బ్రోచితివి
ప్రవిమల రక్తము కలువరి సిలువలో
కలునకు నిచ్చితివి
ప్రేమ కృపా మహదైశ్వర్యములతో
పాపము తుడిచితివి – నా పాపము తుడిచితివి
పాపము శాపము నరకపు వేదన
మరి తొలగించితివి
అపరాధములచే చచ్చిన నన్ను
ధర బ్రతికించితివి – నన్ను బ్రతికించితివి
దేవుని రాజ్యపు వారసుడనుగా
క్రీస్తులో చేసితివి
చీకటి రాజ్యపు శక్తుల నుండి
నను విడిపించితివి – చెర నను విడిపించితివి
ముద్రించితివి శుద్ధాత్మతో నను
భద్రము చేసితివి
సత్యస్వరూప నిత్యనివాసి
సొత్తుగా చేసితివి – నీ సొత్తుగా చేసితివి
అన్యుడనై నిను ఎరుగక యున్నను
ధన్యుని చేసితివి
ప్రియ పట్టణ పౌరుల సేవింపను
వరముల నొసగితివి – కృప వరముల నొసగితివి

Video