పాపానికి నాకు
Paapaaniki Naaku
Lyricistఅనిల్ కుమార్
UncategorizedAdded on 6/21/2017
Lyrics
పాపానికి నాకు ఏ సంబంధము లేదు పాపానికి నాపై ఏ అధికారము లేదు పాపానికి నాకు ఏ సంబంధము లేదు పాపానికి నాపై ఏ అజమాయిషీ లేదు నా పాపములు అన్ని నా ప్రభువు ఏనాడో క్షమియించివేసాడుగా మరి వాటినెన్నడును జ్ఞాపకము చేసికొనను అని మాట ఇచ్చాడుగా నేనున్నా నేనున్నా నా యేసుని కృప క్రింద నే లేను నే లేను ధర్మ శాస్త్రం క్రింద (2) ||పాపానికి|| కృప ఉందని పాపం చేయొచ్చా – అట్లనరాదు కృప ఉందని నీతిని విడువొచ్చా – అట్లనరాదు కృప ఉందని పాపం చేయొచ్చా – అట్లనరాదు కృప ఉందని నీతిని విడువొచ్చా – నో కృప అంటే లైసెన్స్ కాదు కృప అంటే ఫ్రీ పాస్ కాదు – పాపాన్ని చేసేందుకు కృప అంటే దేవుని శక్తి కృప అంటే దేవుని నీతి – పాపాన్ని గెలిచేందుకు గ్రేస్ ఈస్ నాట్ ఎ లైసెన్స్ టు సిన్ ఈస్ ఎ పవర్ ఆఫ్ గాడ్ టు ఓవర్ కం (4) ||నేనున్నా|| కృప ద్వారా ధర్మ శాస్త్రముకు – మృతుడను అయ్యా కృప వలన క్రీస్తులో స్వాతంత్య్రం – నే పొందితినయ్యా కృప ద్వారా ధర్మ శాస్త్రముకు – మృతుడను అయ్యా కృప వలెనే క్రీస్తులో స్వాతంత్య్రం క్రియల మూలముగా కాదు కృపయే నను రక్షించినది – నా భారం తొలగించినది కృప నను మార్చేసినది నీతి సద్భక్తుల తోడ – బ్రతుకమని బోధించినది గ్రేస్ టుక్ అవే బర్డెన్ ఫ్రమ్ మి అండ్ టాట్ టు మి లివ్ రైటియస్లీ (4) ||నేనున్నా|| పాపానికి మృతుడను నేనయ్యా – హల్లెలూయా కృప వలెనె ఇది నాకు సాధ్యం – అయ్యిందిరా భయ్యా పాపానికి మృతుడను నేనయ్యా – హల్లెలూయా కృప వలెనె ఇది నాకు సాధ్యం కృపను రుచి చూచిన నేను దేవునికే లోబడుతాను – పాపానికి చోటివ్వను పరిశుద్ధత పొందిన నేను నీతి సాధనములుగానే – దేహం ప్రభుకర్పింతును యీల్డ్ యువర్ బాడీస్ అంటు ద లార్డ్ యాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ రైటియస్నెస్ యీల్డ్ యువర్ బాడీస్ అంటు ద లార్డ్ యాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ రైటియస్నెస్ (2) ||నేనున్నా|| ధర్మశాస్త్రం పాపం అయ్యిందా – అట్లనరాదు ధర్మశాస్త్రం వ్యర్థం అయ్యిందా – అట్లనరాదు ధర్మశాస్త్రం పాపం అయ్యిందా – అట్లనరాదు ధర్మశాస్త్రం వ్యర్థం అయ్యిందా – నో ధర్మశాస్త్రం కొంత కాలమేగా ధర్మశాస్త్రం బాలశిక్షయేగా – ప్రభు నొద్దకు నడిపేందుకు క్రీస్తొచ్చి కృప తెచ్చెనుగా ధర్మశాస్త్రం నెరవేర్చెనుగా – మనలను విడిపించేందుకు లా హాస్ లెడ్ ది పీపుల్ టు క్రైస్ట్ నౌ గ్రేస్ విల్ మేక్ హిస్ కాన్క్వరర్స్ (4) ||నేనున్నా||