పాపిగ నను చూడలేక
Paapiga Nanu Choodalaeka
UncategorizedAdded on 3/25/2024
Lyrics
పాపిగ నను చూడలేక – పాపముగా మారినావా దోషిగ నను చూడలేక – నా శిక్ష నీవు పొందినావా నా తల యెత్తుటకు – నీవు తల వంచితివే అర్హత నాకిచ్చుటకు – అవమాన-మొందితివే తండ్రితో నను చేర్చుటకు – విడనాడబడితివే జీవము నాకిచ్చుటకు – మరణము-నొందితివే నీవే నీవే – నీవే దేవా నీవే నీవే – నా యేసయ్యా పరమును వీడి ఈ భువికి దిగి వచ్చిన రక్షకుడా మహిమను వీడి నా వెలని చెల్లించిన ప్రేమామయుడా నే వెదకి రాలేనని సత్యమునెరిగి నీవే నా దరికి పరుగెత్తితివి దాసత్వము నుండి నను విడిపించి తండ్రి అని పిలిచే భాగ్యము నిచ్చితివి ||నీవే|| నా స్థానములో నీవే నిలిచి నీ స్థానమే నాకిచ్చితివి సౌందర్యవంతునిగా నన్నే చేసి సొగసంతా కోల్పోయితివి నీ బలమంతా నాకే ఇచ్చి బలియాగముగా నీవు మారితివి ఐశ్వర్యవంతునిగా నన్నే చేసి దీనతనే హత్తుకొంటివి ||నీవే|| నా బలమంతా నీవే – నా సౌందర్యము నీవే నా ఐశ్వర్యము నీవే – నీవే నీవే నా అతిశయము నీవే – నా ఆనందం నీవే నా ఆధారం నీవే – నీవే నీవే యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (2) ||పాపిగ||