పేద నరుని రూపము
Paeda Naruni Roopamu
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 7/30/2017
Lyrics
పేద నరుని రూపము ధరించి యేసు రాజు నీ చెంత నిలచె అంగీకరించు-మాయనను (2) ||పేద నరుని|| కాళ్ళ చేతులందు సీలల్ కొట్టబడెన్ ముళ్ల మకుటము శిరస్సున పెట్టబడెన్ నింద వేదన శ్రమలను సహించెనేసు చిందే తనదు రక్తము నీ పాపముకై దీనుడై నిన్ను పిలచుచుండె (2) ||పేద నరుని|| తల వాల్చుటకు ఇల స్థలమే లేదు దప్పి తీర్చుకొన నీరు దొరకలేదు తన్ను ఆదరించు వారెవరు లేరు ప్రియ రక్షకుడు సిలువలో వ్రేలాడే పాట్లుపడే నిన్ను విడిపింపను (2) ||పేద నరుని|| ప్రభు సాతాను తలను చితుక ద్రొక్కెన్ పాప డాగులన్ రక్తముతో కడిగెన్ నీ వ్యాధిని వేదన తొలగించ నీ శాపము నుండి విడిపింప సిలువలో విజయము పొందే (2) ||పేద నరుని|| మాయ లోకమును నీవు నమ్మకుము మనుష్యుల మనస్సు మారిపోవునిల నిత్య దేవుని ప్రేమను నమ్మి నీవు నిశ్చయముగా ప్రభువులో ఆనందింప నేడే రమ్ము విశ్వాసముతో (2) ||పేద నరుని|| తామసించెదవేల ఓ ప్రియుడా ప్రియ యేసుని యొద్దకు లేచి రమ్ము ఈ లోకము నీకివ్వని శాంతిని ఈ దినమే ప్రభువు నీకొసగ ప్రేమతో నిన్ను పిలచుచుండె (2) ||పేద నరుని||