పేతురు వలె నేను

Paethuru Vale Naenu

Lyricistజాస్పర్ కునపో
UncategorizedAdded on 1/29/2024

Lyrics

ఆరాధ్యుడవు నీవే ప్రభు
ఆనందముతో ఆరాధింతును
అత్యున్నత ప్రేమను కనుపరచినావు
నిత్యము నిను కొనియాడి కీర్తింతును
(2)        ||ఆరాధ్యుడవు||
పేతురు వలె నేను ప్రభునకు దూరముగా
పనులతో జనులతో జతబడి పరుగెత్తగా
ప్రయాసమే ప్రతిక్షణం ప్రతి నిమిషం పరాజయం
గలిలయ తీరమున నన్ను గమనించితివా
(2)        ||ఆరాధ్యుడవు||
ప్రభురాకడ నెరిగి జలజీవరాసులు
తీరము చేరిరి కర్తను తేరి చూడగా
పరుగెత్తెను పలు చేపలు ప్రభు పనికై సమకూడి
సంతోషముతో ఒడ్డున గంతులేసెను
(2)        ||ఆరాధ్యుడవు||
నిన్నెరుగను అని పలికి అన్యునిగా జీవించితి
మీనముతో భోజనము సమకూర్చితివా
ఆచేపల సమర్పణ నేర్చితి నిను వెంబడింతు
అద్వితీయ దేవుడవు నీవే ప్రభు
(2)        ||ఆరాధ్యుడవు||

Video