పరలోకము నా దేశము
Paralokamu Naa Daeshamu
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 8/12/2016
Lyrics
పరలోకము నా దేశము పరదేశి నేనిల మాయలోకమేగ నేను యాత్రికుడను ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎల్లప్పుడు విశ్వాసముతో యాత్రను సాగింతును (2) ||పరలోకము|| దూతలు పాడుచుందురు పరమందున దీవా రాత్రమునందు పాడుచుందురు పావనుని చూచి నేను హర్షింతును నిత్యము (2) ||పరలోకము|| రక్షకుని చెంతకు ఎప్పుడేగెదన్ వీక్షించెద నెప్పుడు నాదు ప్రియుని కాంక్షించెద నా మదిలో ఆయన చెంతనుండ (2) ||పరలోకము|| అద్దరికి ఎప్పుడు నేను వెళ్లెదన్ అగుపడుచున్నది గమ్యస్థానము అచ్చటనే చూచెదను పరిశుద్ధులెల్లరిన్ (2) ||పరలోకము|| నిత్యానందముండును పరమందున నీతి సమాధానము ఉండునచ్చట పొందెదను విశ్రాంతిని శ్రమలన్నియు వీడి (2) ||పరలోకము||