పరమ దైవమే
Parama Daivamae
Lyricistఏ ఆర్ స్టీవెన్సన్
UncategorizedAdded on 12/9/2020
Lyrics
యేసు పుట్టుకలోని పరమార్ధాన్ని గ్రహించి తిరిగి జన్మిస్తే ఆయన కొరకు జీవించగలం ఆయనను మనలో చూపించగలం పరమ దైవమే మనుష్య రూపమై ఉదయించెను నా కోసమే అమర జీవమే నరుల కోసమై దిగి వచ్చెను ఈ లోకమే క్రీస్తు పుట్టెను – హల్లెలూయ క్రీస్తు పుట్టెను – హల్లెలూయ క్రీస్తు పుట్టెను – హల్లెలూయా (2) ||పరమ దైవమే|| ఆకార రహితుడు ఆత్మ స్వరూపుడు శరీరమును ధరించెను సర్వాధికారుడు బలాఢ్య ధీరుడు దీనత్వమును వరించెను వైభవమును విడిచెను – దాసునిగను మారెను – దీవెన భువికి తెచ్చెను – ముక్తి బాటగా… ||పరమ దైవమే|| అనాది వాక్యమే కృపా సమేతమై ధరపై కాలు మోపెను ఆ నీతి తేజమే నరావతారమై శిశువై జననమాయెను పాపి జతను కోరెను – రిక్తుడు తానాయెను భూలోకమును చేరెను – యేసు రాజుగా… ||పరమ దైవమే|| నిత్యుడు తండ్రియే విమోచనార్ధమై కుమారుడై జనించెను సత్య స్వరూపియే రక్షణ ధ్యేయమై రాజ్యమునే భరించెను మధ్య గోడ కూల్చను – సంధిని సమకూర్చను – సఖ్యత నిలుప వచ్చెను – శాంతి దూతగా… ||పరమ దైవమే||