పరవాసిని నే జగమున
Paravaasini Nae Jagamuna
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 1/15/2016
Lyrics
పరవాసిని నే జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారిన్ నా గురి నీవే నా ప్రభువా నీ దరినే జేరెదను నేను.. నీ దరినే జేరెదను ||పరవాసిని|| లోకమంతా నాదని యెంచి బంధు మిత్రులే ప్రియులనుకొంటిని అంతయు మోసమేగా వ్యర్ధము సర్వమును ఇలలో.. వ్యర్ధము సర్వమును ||పరవాసిని|| ధన సంపదలు గౌరవములు దహించిపోవు నీలోకమున పాపము నిండె జగములో శాపము చేకూర్చుకొనే లోకము.. శాపము చేకూర్చుకొనే ||పరవాసిని|| తెలుపుము నా అంతము నాకు తెలుపుము నా ఆయువు యెంతో తెలుపుము ఎంత అల్పుడనో విరిగి నలిగియున్నాను నేను.. విరిగి నలిగియున్నాను ||పరవాసిని|| ఆ దినము ప్రభు గుర్తెరిగితిని నీ రక్తముచే మార్చబడితిని క్షమాపణ పొందితివనగా మహానందము కలిగే నాలో.. మహానందము కలిగే ||పరవాసిని|| యాత్రికుడనై ఈ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో అమూల్యమైన ధనముగా పొందితిని నేను యేసునే.. పొందితిని నేను ||పరవాసిని|| నా నేత్రములు మూయబడగా నాదు యాత్ర ముగియునిలలో చేరుదున్ పరలోక దేశము నాదు గానము ఇదియే నిత్యము.. నాదు గానము ఇదియే ||పరవాసిని||