పరవశించెద
Paravashimcheda
Lyricistమేరీ బ్యూలా
UncategorizedAdded on 8/25/2022
Lyrics
పరవశించెద నీ వాక్యములో పరవశించి నే పాడెద నీ సన్నిధిలో నీ వాక్యమే నన్ను బ్రతికించినది నీ వాక్యమే నన్ను నడిపించినది ఆరాధన స్తుతి ఆరాధన నా ప్రాణమైన దేవా నీకారాధన నీ పాద సన్నిధిలో నేనున్నపుడు వాక్యమనే పాలతో నను పోషించితివి నీ వాక్యమే నాకు సత్యము జీవము నీ వాక్యమే నా పాదములకు దీపము (2) ||ఆరాధన|| ఈ లోక బంధాలు కృంగదీసినపుడు వాక్యమనే నీ మాటతో నన్నాదరించితివి నీ వాక్యమే నను బలపరచినది నీ వాక్యమే నీలో స్థిరపరచినది (2) ||ఆరాధన||