పరిశుద్ధాత్ముడా నీకే వందనం
Parishuddhaathmudaa Neekae Vmdanm
Lyricistఫిలిప్ గరికి
UncategorizedAdded on 10/31/2018
Lyrics
పరిశుద్ధాత్ముడా నీకే వందనం ఆదరణ కర్తా సమాధాన కర్త సర్వ సత్యములోనికి నడిపే మా ప్రియా దైవమా (2) ||పరిశుద్ధాత్ముడా|| స గ గ గ గ మ గ రి స ని ద ప స గ గ గ గ మ గ ని గ మ స గ గ గ గ మ గ రి స ని ద ప ప ద ని రి స.. రి స మాతోనే ఉండిన వేళ శక్తితో నింపబడుదుము సర్వ లోకానికి మేము సాక్ష్యమిచ్చెదం శక్తి చేత కానే కాదు బలముతోను కానే కాదు నీ ఆత్మ ద్వారా జరుగును కార్యములు నీ వల్లే జరుగును మహిమలు (2) ||పరిశుద్ధాత్ముడా|| దేవుని రాజ్యమనగా నీతియు సమాధానము పరిశుద్ధ ఆత్మ యందలి ఆనందము ఆత్మ గల వాడే దేవుని వాడు ఆత్మ మూలముగా జీవించును విజ్ఞాపనమును చేయును మన పక్షముగా సమస్తమును బోధించును (2) ||పరిశుద్ధాత్ముడా||