పరిశుద్ధుడవై

Parishuddhudavai

Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 1/3/2018

Lyrics

పరిశుద్ధుడవై – మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు
బలవంతుడవై – దీనుల పక్షమై కృప చూపు వాడవు
దయాళుడవై – ధారాళముగా నను దీవించిన శ్రీమంతుడా
ఆరాధన నీకే నా యేసయ్యా
స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా
(2)        ||పరిశుద్ధుడవై||
నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిను సేవించుటకు
నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి
శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి
నీ దాసుల ప్రార్ధనలు సఫలము చేసితివి
||ఆరాధన||
నీ నిత్యమైన ఆదరణ చూపి నను స్థిరపరచుటకు
నీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నను ప్రేమించితివి
నాకు ప్రయోజనము కలుగజేయుటకు నీ ఉపదేశమును బోధించి
నీ దాసుని ప్రాణమును సంతోషపరచితివి
||ఆరాధన||
ఆనందకరమైన దేశములో నేను నిను ఘనపరచుటకు
నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపజేసితివి
మేఘ వాహనుడవై వచ్చుఁవరకు నే కనిపెట్టుచుందును నీ కోసము
నీ దాసుల కాంక్షను సంపూర్ణ పరచెదవు
||ఆరాధన||

Video