పసి బాలుడై
Pasi Baaludai
Lyricistశ్రీనివాస్ బండారు
UncategorizedAdded on 11/8/2021
Lyrics
పసి బాలుడై ప్రేమా రూపుడై – ఇమ్మానుయేలు దైవమై నీతి తేజమై సత్య రూపమై – బలమైన నా దుర్గమా దీనుడవై పరమును విడిచి – నా కొరకు దిగి వచ్చావు నా రక్షణ కొరకై నీవు – నర రూపము ధరించినావు రండి రండి నేడు బెత్లహేము పురముకు రండి రండి ఆ యేసు రాజునొద్దకు రండి రండి పరిశుద్ధాత్ముని యొద్దకు రండి రండి నేడు ఉత్సహించి పాడుటకు ||పసి బాలుడై|| యేసు రాజు పుట్టేనని హల్లేలూయా గంతులు వేసి పాడుదమా హల్లేలూయా నిజ రక్షకుడు అని హల్లేలూయా ఆరాధించెదము హల్లేలూయా ||రండి|| ఆశ్చర్యకరుడని యేసు హల్లేలూయా పరిశుద్ధుడు అని పాడుదమా హల్లేలూయా రాజులకు రాజు హల్లేలూయా ఘనపరచి కీర్తింతున్ హల్లేలూయా ||రండి||